ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అల్లారెడ్డి అనసూయమ్మ

ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి అల్లారెడ్డి అనసూయమ్మ  గారు ఈరోజు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది

కరోనా నేపథ్యంలో  ఆర్బాటాలు లేకుండా సాధారణంగా మంత్రి గౌతమ్ రెడ్డి గారి సమక్షంలో ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేడు శ్రీమతి అల్లారెడ్డి అనసూయన్న పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శ్రీమతి అనసూయమ్మ గారికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ గోతం వెంకటసుబ్బయ్య గారు, ఆత్మకూర్ మాజీ జెడ్పిటిసి డాక్టర్ ఆదిశేషయ్య గారు, ఆత్మకూరు రూరల్ నాయకులు శ్రీ చిట్టమూరు జితేందర్ నాగ్ రెడ్డి గారు, ఆత్మకూరు టౌన్ ప్రెసిడెంట్ ఆల్లారెడ్డి ఆనంద్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు నోటి వినయ్ కుమార్ రెడ్డి గారు, రాజా గారు పాల్గొన్నారు.