తెలుగుదేశంపార్టీ నగర ప్రధాన కార్యదర్శి శ్రీమతి రోజా రాణి గారు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్, శ్రామిక నగర్ లోని వారి నివాసంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 పార్టీలో కొత్తగా చేరినవాళ్ళు, మొదటి నుండి పార్టీకోసం కష్టం చేసిన వారు అందరూ కలిసికట్టుగా రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలని ప్రతీ గడపకూ చేరేలా పని చేయాలి. రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి , శ్రీమతి  రోజారాణి గారికి రూరల్ నియోజకవర్గంలో ఉజ్వల భవిషత్తు కల్పిస్తాం.  రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 30వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూకాటి ప్రసాద్ గారి గెలుపు కోసం పనిచేస్తానన్న శ్రీమతి రోజారాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

పై కార్యక్రమంలో 30వ డివిజన్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూకాటి ప్రసాద్, కూకాటి హరి, మన్నేపల్లి రఘు, యానాదయ్య, నారాయణ రెడ్డి, జనార్దన్, కరీమా, ఆనంద రావు, విగ్నేష్, ఖాదర్ బాషా, జమీర్, సురేష్, పెంచలయ్య, కట్టల రమణయ్య, మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.