వంద రోజులకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారంతో డిసెంబర్ 20న ముగిసింది. దాదాపు మూడు నాలుగు వారాలుగాసోషల్ మీడియా అంచనా వేస్తున్నట్లే అభిజిత్ విజేతగా నిలిచాడు. అఖిల్ రన్నరప్ గా మిగిలాడు. అంతకు ముందు పాతిక లక్షలు తీసుకుని సోహల్ గేమ్ నుంచి నిష్క్రమించాడు. 


 అంతకుముందు హారిక, ఆ పై అరియానా ఎలిమినేట్ అయ్యారు. పెద్దగా ఆశ్చర్యం లేకుండానే అభిజిత్ గెలుపు కన్ఫామ్ అయిపోయింది. చిరకాలంగా అభిజిత్ ప్రమోషన్ కావచ్చు.. ఫ్యాన్స్ కావచ్చు.. సోషల్ మీడియాను ఊపు ఇచ్చేసింది. అందువల్ల నాలుగైదు వారాల ముందుగానే ఫలితం వినిపిస్తూ వచ్చింది. 


 నిన్నటి నుంచి బిగ్ బాస్ ఫలితాలు లీక్ అయిపోయి చక్కర్లు కొట్టేశాయి. ఆ లీకులే ఇవ్వాళ నిజమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ విజేతను ప్రకటించారు. హీరోయిన్లు ప్ర‌ణీత‌, మెహ‌రీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ ప‌టాకాల‌తో షో డ‌బుల్ జోష్‌తో ముందుకు సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అంద‌రూ ఒకే వేదికపై డ్యాన్స్ చేశారు.