*ఎయిమ్స్ హాస్పిటల్ లో ఇటీవల లేబూరు స్వర్ణలత అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే... ఎయిమ్స్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తోటపల్లిగూడూరు మండలంలోని చింతోపు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.. సరైన వైద్యం అందించకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,ఇండియన్ అసోసియేషన్ ఆఫ్  లాయర్స్ నేత సుబ్బారెడ్డి మాట్లాడుతూ వన్ టౌన్ సిఐ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు... జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ కేసుకు సంబంధించి మధు బాబు అనుసరిస్తున్న వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. బాధితుల పైనే కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు*