మహిళా చట్టాలపై మరింత అవగాహన కావాలి....

మహిళా చట్టాలపై మరింత అవగాహన పెంచడంలో మహిళా సంఘాలు కృషి చేయాలని


అడిషనల్ ఎస్పీ  వెంకట రత్నం సూచించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా ఛైర్మన్ మల్లెం‌ విమల బుధవారం అడిషనల్ ఎస్పీ ని కలిసారు.మహిళా రక్షణ కు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీనిని జిల్లాలో పటిష్టంగా అమలు చేయడం లో మహిళా ‌సంఘాలు తమ వంతు సహకారం ఇస్తాయన్నారు. మహిళా పోలీస్ అధికారి గా అండగా నిలవాలని విమల కోరారు. ఈ సమావేశంలో దిశ ఫౌండేషన్  సభ్యులు  తదితరులు పాల్గొన్నారు