విడవలూరు మండలం లోని నార్త్ రాజుపాలెం లో ఉన్న పురుగు మందుల దుకాణాలను ఏ డి ఎ డి సుజాత గురువారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె దుకాణాల్లో అనుమతులు ఉన్న పురుగుమందులనే విక్రయిస్తున్నారా లేదా క్షుణ్నంగా పరిశీలించారు స్టాక్ రిజిస్టర్లో పురుగు మందుల నిల్వకు వాస్తవ నిల్వకు వ్యత్యాసాలను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పూర్తయినందున పురుగుమందుల విక్రయాలు జోరందుకొన్నాయన్నారు అనుమతుల్లేని పురుగుమందులు విక్రయిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు అందువల్లే అన్ని దుకాణాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఎవరైనా అనుమతులు (పీసీ) లేని పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు వెంట మండల వ్యవసాయ అధికారి సిహెచ్ ఎస్ లక్ష్మీ ఉన్నారు