నా శేష జీవితం మీ అభివృద్ధి కోసమే
                                - ఎంపీ ఆదాల

నా శేష జీవితాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కేటాయిస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు 

సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పంది ఇంటి  సుబ్బయ్య ఎస్సీ ఎస్టీ బిసి సేవా సమితి అధ్యక్షులు కాకి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆదివారం ఘనంగా పౌర సన్మానం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

నాకు బడుగు బలహీన వర్గాలతో చిరకాల స్నేహం ఉందని, దాన్ని ఎప్పటికీ నిలుపుకోవాలన్న దే తన అభిమతమని పేర్కొన్నారు 

ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన పంది ఇంటి సుబ్బయ్య కాకి శ్రీనివాసులును ఆయన అభినందించారు 

బడుగు వర్గాలకు చేయూత ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు 

ఇప్పటికీ కొన్ని వర్గాలు 70 ఏళ్లుగా వెనుకబడే  ఉన్నాయని పేర్కొన్నారు .

వారికోసం నా శేష జీవితాన్ని కేటాయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు మీరు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు .

వెనుకాడేది లేదని ఈ సందర్భంగా తెలిపారు 

నిర్వాహకులు పదింటి సుబ్బయ్య కాకి శ్రీనివాసులు ఆదాల బడుగు వర్గాల పక్షపాతి అని కొనియాడారు .

ఎప్పుడు ఏ సమస్య తీసుకువెళ్లిన పరిష్కారం చూపేందుకు ముందుంటారని ప్రశంసించారు 

ఈ సందర్భంగా నిర్వాహకులు భారీ గజమాలతో ఆదాల ను సత్కరించారు. 

సన్మాన పత్రాన్ని అందజేశారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సన్మానిం చెందుకు అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. 

ఈ కార్యక్రమంలో *విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి* స్వర్ణ వెంకయ్య సుధాకర్ రెడ్డి రమేష్ రెడ్డి అబూబకర్ నరసింహారావు మధు కాకునూరి చెంచురామయ్య 

కుడుముల సుబ్బారావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కళాకారులు డప్పు ఉత్సవాలతో పాటు 

మాదిగల జీతం కళారూపంలో ప్రదర్శించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు చూరగొన్నారు ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాల వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు