"కరోనా కష్టకాలంలో అండగా నిలిచాం"- కాకాణి.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పంట పాళెం గ్రామంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యం.పీ.టీ.సీ., జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తిరుపతి ఉప ఎన్నికలో డా౹౹గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉 కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ చేశాం.


👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.


👉 మనకి అన్ని విధాలా అండగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందించి ఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థులతో పాటు అత్యంత కీలకమైన తిరుపతి ఉప ఎన్నికలో మన అభ్యర్థి గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవలసిన బాధ్యత మనపై ఉంది.


👉 మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల నడ్డి విరిచిన వారికి అధికారం కోల్పోయిన తరువాత రైతులు గుర్తుకురావడం హాస్యాస్పదం.


👉 వ్యవసాయ శాఖ మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని రైతుల పేరిట దోచుకున్నవారికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు.


👉 స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి, ఆసక్తి ఉన్న చోట పోటీ చేయవచ్చు అంటూ, చంద్రబాబు ప్రకటనలు చూసి ప్రజలు ఆయనకు పిచ్చి పట్టినట్టు భావిస్తున్నారు.


👉 చంద్రబాబును రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖాతరు చేయడం లేదు.


👉 చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రం తమను గెలిపించాలని ప్రచారం చేసుకుంటూ, చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, తిరుగుతున్నారు.


👉 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట బిజెపి లాంటి ఇతర పార్టీలకు తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం అనైతికం.


👉 తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీ పై దాడి చేస్తున్న తెలుగుదేశం పార్టీ, స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో లోపాయికారితనంగా బిజెపికి మద్దతివ్వడాన్ని చూసి, జనం నవ్వుకుంటున్నారు.


👉 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారైందని రుజువు చేద్దాం.