ధైర్యంగా వెళ్లి రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి 
అసత్య ఆరోపణలను నమ్మొద్దు, చట్టం ముందు అందరూ సమానమే 
జిల్లాలో 16 చెక్ పోస్టులు, 46 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 46 స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, 46 సింగిల్ విండోస్, మొబైల్ పార్టీలు ఏర్పాటు 
1.70 లక్షల నగదు, 84 లీటర్స్ మద్యం, 1-బైక్, 1-కారు, 2951-గుట్కా పాకెట్స్, 3.4 కేజి గాంజాయి స్వాధీనం 
జిల్లాలో 10,000 మందికి పైగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది 
శనివారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రింది స్థాయిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ పండగ వాతావరణంలో రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును ధైర్యంగా, ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ప్రణాళికతో తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యస్పి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 10,000 మందిని ముందస్తుగా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని, రూ.1,70000 నగదు, 84 లీటర్స్ మద్యం, బైక్-1, కారు-1, గుట్కా ప్యాకెట్స్-2951, గంజా-3.4 కేజీలు, మొత్తం సుమారు 2 లక్షల విలువ గల సీజర్స్ పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతానికి జిల్లాలో 16 చెక్ పోస్టులు, 46 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 46 స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, అన్నీ రకాల అనుమతుల కొరకు ప్రతి ఎంపిడిఒ ఆఫీసులలో 46 సింగిల్ విండోస్, మొబైల్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కుల, మత, ప్రాంత, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాతంగా రక్షణ కల్పించే బాధ్యత మాదే అని, ఏ సమయంలో నైనా, ఎటువంటి సమస్య వచ్చినా తెలపాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఎట్టిపరిస్థితులలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని, ఉల్లంఘించిన ఎడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడుతాయని తెలిపారు.