మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు జడ్పీటీసీ గా నామినేషన్లు దాఖలు చేసిన టిడిపి, బిజెపి మరియు వైసిపి డమ్మీ అభ్యర్థులు నేడు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం కేటాయించిన చిగురుపాటి ప్రసన్న (ఎస్సీ మహిళ) జెడ్పీటీసీ గా ఏకగ్రీవ ఎన్నిక ఇక లాంఛన ప్రాయమైనది.  నెల్లూరు జిల్లా పరిషత్ లో వైసిపి ఖాతాలో తొలి బోణీ రాపూరు జడ్పీటీసీ తో ప్రారంభమైనది.