మంగళవారం వైఎస్సార్‌ కిశోరి వికాశం-౩, బేటి బచావో చేటి పడావో అమలులో భాగంగా డికెడబ్ల్యూ డిగ్రీ కళాశాల నందు మెుత్తం 200 మంది డిగ్రీ విద్యార్ధినులకు బాల్య వివాహాలు, దిశా చట్టం, ఫోస్కో చట్టం, వివిధ రకాల అంశాల పై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ తీసుకున్న డిగ్రీ కాలేజి విద్యార్దునులు నెల్లూరు జిల్లా నందు ఉన్న అప్పర్‌ ప్రైమరీ హైస్కూల్స్‌కి వెళ్ళి పాఠశాలలో 8,9,10 తరగతుల విద్యార్ధునులకు బాల్య వివాహాలు పైన జిశా చట్టం పైన 181 చైల్డ్‌ లైన్‌ 1098, ఫోస్కో చట్టం పైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు నగర పరిధిలో గల 56 ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పొదలకూరు రోడ్డు, నవాబు పేట, కర్ణాల గుంటలో గల పాఠశాలల నందు శిక్షణ తీసుకున్న డిగ్రీ విద్యార్ధునుల చేత వైఎస్సార్‌ కిశోరి వికాశం-3, బేటి బచావో బేటి 
పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క పాఠశాల నందు 5 నుంచి 10 డిగ్రీ విద్యార్దునులు పాల్గొంటారని తెలియజేయడమైనది. మెుత్తం 1000 మంది విద్యార్దునులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జిల్లా స్త్రీ శిశు అభివృద్ది సంస్ధ బి.సుధా బారతి, డికెడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ మస్తానయ్య, సిడిపిఒ ఐసిడియస్‌ ప్రాజెక్ట్‌ నెల్లూరు సత్యకుమారి, జిల్లా సమగ్ర బాలల సంరక్షణ అధికారి బి.సురేష్‌, ఐసిడియస్‌ నెల్లూరు అర్బన్‌ సూపర్‌ వైజర్స్‌, ఐసిపియస్‌ సిబ్బంది, డికెడబ్ల్యూ డిగ్రీ కళాశాల విద్యార్దునులు పాల్గొన్నారు.