కొడవలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డా॥ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు 3వ విడత కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,డిసిఎమ్‌ఎస్‌ ఛైర్మన్ వీరి చలపతిరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, సిబ్బంది, మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.