వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజలలో నాడు - ప్రజల కోసం నేడు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా నగర నియోజకవర్గంలోని 15, 8వ డివిజన్ లలో  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం అందించే పథకాలను వివరించారు.  ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, అంచూరి శ్రీనివాసులు నాయుడు, శివప్రసాద్ రెడ్డి, షమీం, శరత్ రెడ్డి, కిశోర్, ఎస్.కె.సుభాన్, కీచు, దిలీప్, ఖాజావాలి, రఫీ, ఇలియాజ్, ఫయాజ్, దొంతాలి రఘు, గూడూరు శ్రీధర్ రెడ్డి, నాగరాజు,  తదితరులు పాల్గొన్నారు.