నెల్లూరు పట్టణంలోని వైయంసి గ్రౌండ్స్ లో మొట్టమోదటిసారిగా ఏర్పాటు చేసిన సింహపురి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని సింహపురి ఎగ్జిబిషన్ నిర్వాహకులు గుండుబోయిన మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, యువజన నాయకులు రూప్ కుమార్ యాదవ్, ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి ముఖ్య అతిధులుగా హాజ


రైనారు. ప్రతి ఏడాది నిర్వహించే ఎగ్జిబిషన్.. గతేడాది కరోనా నేపథ్యంలో నిర్వహించలేకపోయారని.. ఈ ఏడాదిలో సమ్మర్ స్పెషల్ గా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కరోనా జాగ్రత్తలు పాటిస్తు నిర్వహించాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, ఇంతియాజ్, రమేష్, సునీల్, నరేంద్ర, సుబ్బు, చిట్టి హాజరయ్యారు.