కార్యదర్శులందరూ మహిళలో ఆత్మస్టెర్యాన్ని నింపుతూ ఆత్మహత్యలను నిరోధిందాలి 
మహిళలు, బాలలు, వృద్ధుల సంక్షేమం భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి
నెల్లూరు, డిసెంబర్‌ 23, (రవికిరణాలు) : జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు 216 బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల 2 వారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్, డిటిసి ప్రిన్సిపాల్ అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) పి.మనోహర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డియస్పి(ఎఆర్) రవీంద్ర రెడ్డి, ఏపిడి, ఐసిడిఎస్‌ ఎ.శేషకుమారి సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా యస్పి మాట్లాడుతూ డిటిసి లో జరిగిన మొదటి బ్యాచ్ మంచి ఫలితాలతో స్టేట్ లోనే టాప్ లో నిలిచిందని, ఎంతో ఉన్నత విద్యార్హతలు కలిగిన మీరు ఈ ఉద్యోగాలు పొందటం అభినందనీయమని, ఇంకా మీరంతా మస్తీలో ఉన్న మహిళా పోలీసులు అని, శిక్షణ తరువాత కార్యదర్శులందరూ సమాజానికి కన్నులు-చెవులుగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణలో భాగంగా శాంతి భద్రతలు మహిళలు,బాలలు, వృద్ధులపై జరిగే హింస లైంగిక వేదింపులు, దాడులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి వారికి రక్షణ భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు ఒక మిషన్ మోడ్ లో అందరూ సేవలు అందించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా
శిక్షణార్ధులకు సందేశాన్ని అందించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డిటిసి ప్రిన్సిపాల్ అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) మాట్లాడుతూ ఈ రోజు మొత్తం 109 మంది అభ్యర్ధులు 210 బ్యాచ్ శిక్షణ రిపోర్ట్ చేసుకోవడం జరిగిందని, వీరికి మొదటి వారం శిక్షణలో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంశాలపై, రెండవ వారంలో పోలీసు చట్టాలు, అలాగే ప్రతి రోజు యోగా, కరాటే మొదలగు స్వీయ సంరక్షణ అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డిటిసి డియస్పి రవీంద్ర రెడ్డి కో ఆర్డినేట్ చేశారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసిడిఎస్‌ ఎ.శేషకుమారి మాట్లాడుతూ 'సఖి' కేంద్రాల సేవలపై మరియు అన్ని రకాల హెల్ప్ లైన్ సదుపాయాల గురించి విస్తృతంగా అవగాహన పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పై అధికారులతో తో పాటు ఇన్స్పెక్టర్ దర్గామిట్ట యం.నాగేశ్వరమ్మ, డిటిసి-ఆర్‌ఐ సురేష్, ఒఎస్‌సి పారా లీగల్ జ్యోష్న, శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.