రైలుకింద పడి మహిళ మృతి.


నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట: పట్టణంలోని సూళ్లూరు చెరువు వద్ద గుర్తుతెలియని  యువతి రైల్వే ట్రాక్ వద్ద రైలు క్రిందపడి మృతి చెందింది.మృతి చెందిన మహిళ వయస్సు 45 నుండి 50 సంవత్సరములు ఉంటుందని  సూళ్లూరుపేట రైల్వే జి ఆర్ పి ఎస్సై మాలకొండయ్య తెలిపారు. అయితే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కృష్ణ  సంఘటన స్థలానికి చేరుకొని మరణించిన మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.