నెల్లూరు జిల్లా,
గూడూరు టౌన్ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు నందు ఈరోజు #30.9..2021వ తేదిన గురువారం ఉదయం 11 గంటలకు వరద నగర్ ST కాలనీ  నందు #కీర్తిశేషులు శ్రీ పొనకా ఆది శేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అయిన శ్రీ పొనకా మల్లికార్జున్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ప్రతి నెల అతి నిరుపేదలైన 15 కుటుంబాలకు నెల మొత్తానికి సరిపడే 18 రకాల ఫల సరుకులను బహుకరించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా 1వ పట్టణ SI శ్రీ పవన్ కుమార్, చేతులమీదుగా ఫలసరుకులను పంపిణీ చేయడమైనది.అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్,మన ప్రగతి  కుటుంబ సభ్యులు వాకాటి రాంమోహనరావు, PD కరీముల్లా, గ్రానైట్ ప్రభాకర్, KRM, ఆక్వా రమేష్, కోఆర్డినేటర్ CVR న్యూస్ సతీష్, వాలంటీర్ భూమిక తదితరులు పాల్గొన్నారు