నెల్లూరు, జనవరి 02, (రవికిరణాలు) : లూయి బ్రెయిలి 20వ జన్మదిన వేడుకలను ఈ నెల 4వ తేదిన నెల్లూరు పట్టణంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని జాతీయ అంధుల సమాఖ్య(నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది భ్లైండ్‌ ఇండియా) కమిటీ కో-ఆర్డినేటర్‌ ఎం.భానుమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రెస్‌ క్లబ్‌ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జాతీయ అంధుల సమాఖ్య నెల్లూరు జిల్లా, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ విశ్వభారతి అంధుల పాఠశాల కలిసి చేపడుతున్నాయని తెలిపారు. అనంతరం అంధులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేస్తున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లాలోని అంధులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటున్నామన్నారు.