లోక్సభలో ప్రశ్నించిన ఎంపీ ఆదాల 

జాతీయ ప్రతిభా పురస్కారాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏ విధంగా ఉపకరిస్తున్నాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. ఈ ప్రతిభా పురస్కారాలు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయని ,వాటికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మాత్యులు రమేష్ పాఖ్రి యల్ నిశాంక్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2008 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అంద జేస్తున్నామని తెలిపారు. చదువును కొనసాగించలేని వారికి ప్రోత్సాహకంగా ఈ పురస్కారం కింద లక్ష రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నామని తెలిపారు. తొమ్మిదవ తరగతిలో 12 వేల రూపాయలు మొదటిసారిగా అందజేస్తామని, ఇక అక్కడి నుంచి 12వ తరగతి వరకు ఈ పురస్కారం లభిస్తుందని పేర్కొన్నారు .ఎంపిక చేసిన విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ, ఎయిడెడ్  స్కూళ్లలో చదివే విద్యార్థులకు దీన్ని ప్రత్యేకిం చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఈ ప్రతిభా పురస్కారాలు మొత్తం నిర్ణయమవుతుందని పేర్కొన్నారు ఈ పరీక్షను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 18. 75 లక్షల రూపాయలను మంజూరు చేశామని, లక్షా 36 వేల 239 స్కాలర్షిప్పులు దేశవ్యాప్తంగా అందజేస్తున్నామని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ స్కాలర్షిప్పుల వల్ల ఎంతోమంది తమ చదువు కొనసాగించారనే  సంఖ్య తమ వద్ద లేదని తెలిపారు.

 పర్యాటక కాలుష్యం వల్ల ఇబ్బంది లేదు

దేశంలోని పర్యాటక ప్రాంతాల వల్ల పర్యాటకుల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోమవారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో పర్యాటక ప్రాంతాల్లో నీటి, వాయు కాలుష్యం గురించి ప్రశ్నించారు .పర్యాటక కేంద్రాల వల్ల పర్యాటకుల ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధాన మిస్తూ, ఇంతవరకూ పర్యాటక ప్రాంతాల కాలుష్యం వల్ల పర్యాటకులు జబ్బున పడిన దాఖలాలు లేవని, అటువంటి విషయం తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య మండలి తమ శాఖల ద్వారా దేశంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యాటకుల ద్వారా గత మూడేళ్లలో 85. 858 యుఎస్ మిలియన్ డాలర్లను విదేశీ మారక ద్రవ్యంగా ఆర్జించినట్లు తెలిపారు.