ఇసుక,గ్రావెల్ అక్రమ రవాణాను అధికారపార్టీ శాసనసభ్యులే పట్టిస్తానన్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు 
ప్రసన్నకుమార్ రెడ్డి మాటలతో ఇది అసమర్ధ ప్రభుత్వం అని తేలిపోయింది
టీడీపీ చేసిన ఆరోపణలను అబద్ధమని బుకాయించిన వైసీపీ నాయకులు సొంత పార్టీ 

జిల్లాలో యధేచ్చగా ఇసుక,గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో చెపుతున్నదని అది నిజమని నిన్న అధికారపార్టీ శాసనసభ్యుల మాటలతో  రుజువైందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.  కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని,సామాన్యులకు మాత్రం ఇసుక దొరకడం లేదని,వైసీపీ నాయకులు కనుసన్నల్లో ఇసుక సరిహద్దులు దాటుతుందని తెలుగుదేశం పార్టీ అనేకసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోగా, తెలుగుదేశం పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే అని వైసీపీ నాయకులు బుకాయించారని  ,నిన్న నెల్లూరు లో జరిగిన మంత్రుల సమీక్షా సమావేశంలో కోవూరు శాసనసభ్యుడు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక,మట్టి యధేచ్చగా అక్రమ రవాణా జరుగుతుందని,నాతోటి ఎవరైనా వస్తే నేనె పట్టిస్తానని చెప్పారని దీనితో టీడీపీ చేసిన ఆరోపణలు అన్ని నిజనని నిర్ధాన అయిందని ,నిన్న ప్రసన్నకుమార్ రెడ్డి గారి మాటలతో వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అవనీతి, అక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయో అందరికి అర్ధమైందని, గతములో వైసీపీ సీనియర్ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు,శ్రీ కాకని గోవర్ధన్ రెడ్డి గారు కూడా జిల్లాలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని అన్నారని,జిల్లాలో ఇసుక,గ్రావెల్ అక్రమ రవాణా గురించి అధికార పార్టీ శాసనసభ్యులే మాట్లాడుతున్న ప్రభుత్వం  చర్యలు తీసుకోక పోవడానికి  కారణం ప్రభుత్వం లోని పెద్దల సహకారం తోనే ఈ ఇసుక,మట్టి అక్రమ రవాణా జరుగుతుండమేనని, ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న  నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక,గ్రావెల్ అక్రమ రవాణా పై సమగ్ర విచారణ జరిపి అక్రమార్కుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గము నుండి అక్రమంగా రవాణా అవుతున్న ఇసుక గురించి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి గారు మాట్లాడిఉంటే బాగుండేదని,అదేవిధంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని గ్రావెల్ ఇస్తే నేను కోవూరు నుండి నేను ఇసుక ఇస్తానని ప్రసన్నకుమార్ రెడ్డి గారు అన్నారని దీనిని బట్టి అధికారపార్టీ శాసనసభ్యుల కనుసన్నల్లోనే ఇసుక,గ్రావెల్ నడుస్తున్నాయని అర్ధమవుతుందని ,అధికార పార్టీ శాసనసభ్యులు కను సన్నలలోనే ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుందని మరలా వారే ఆరోపణలు చేసి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు  శివుని రమణారెడ్డి,  కావలి ఓంకార్,కలువాయి చెన్నకృష్ణా రెడ్డి,పూల వెంకటేశ్వర్లు,నిరంజన్ రెడ్డి, అగ్గి మురళి,ఇంటూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు