ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి -బీదా మస్తాన్ రావు.
నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరం కలసికట్టుగా , ఏక తాటిపై నడుస్తామని ఇరిగేషన్ మంత్రి పి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన బీదా మస్తాన్‌రావుకు ఆత్మీయ స్వాగత సన్మాన కార్యక్రమాన్ని శనివారం రూరల్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ బేషాజాలు లేకుండా అందరం కలసి కట్టుగా ఉంటాము. వైఎస్సార్‌సీపీలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మంచి స్థానం ఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎటువంటి కార్యక్రమాలైనా వినూత్నంగా చేస్తారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కార్పోరేషన్ ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉండేది. సహాయ సహకారాలు అందించేంది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. నెల్లూరు రూరల్లో నియోజవర్గంలో మొత్తం వైఎస్సార్సీపీలో చేరారన్నారు.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రి అనిల్ కుమార్ అతి చిన్నవయస్సులోనే ఇరిగేషన్ మంత్రిగా అయ్యారు. అనిల్‌కుమార్ వ్యక్తిత్వమే అనిల్ కు మంచి పేరు తెస్తుంది. కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, బీదా మస్తాన్ రావులు కార్పోరేషను దత్తత తీసుకుని విజయం అందించాలని కోరారు.మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులు బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కాని ఆపార్టీకి రాజీనామా చేసి, ప్రజల అశీస్సులతో గెలుపొందిన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని, తమ చిరకాల మిత్రుడు. ఎంపి వేణుంబాకా విజయసాయిరెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎజగన్‌మోహన్‌ రెడ్డి ఓకే చెప్పారన్నారు. జిల్లాలోని అందరు పెద్దలు కూడా తన రాకను ఎక్కడా వ్యతిరేఖించలేదని, ప్రతి ఒక్కరూ స్వాగతించారన్నారు. తాను పార్టీలో నిజాయితీగా, ఎటువంటి స్వార్ధం లేకుండా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడి బడుగు బలహీన వర్గాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 'తనవంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పేదవాళ్లకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి ఎంతో మేలు చేశారు. నవరత్నాలను ఎంతో పవిత్రంగా భావిస్తూ అమలు చేస్తున్నారన్నారు. ఆరు నెలల్లోనే 30 శాతం వరకు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో అమరావతిలో ఒక్క సెంటు కూడా భూమి కొనలేదు. అంత నిజాయితీగా పనిచేశాను. అంతకంటే నిజాయితీగా ఇక్కడ పనిచేస్తాను. జిల్లా నాయకత్వానికి ఎటువంటి మచ్చ రాకుండా పనిచేస్తాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు సన్మానించడం . ఆయన తనపై ప్రేమాభిమానాలు చూపడం పూర్వజన్మసుక్రతమన్నారు. ఈ కార్యక్రమంలో రూపకుమార్ యాదవ్, రాటి వెంకటేశ్వరరావు డివిజన్ కార్డులు తదితరులు పాల్గొన్నారు.