మానవత్వం చాటుకున్న వార్డు వాలంటీర్లు


         సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలోని మన్నార్ పోలూరు,  న్యూ కాలనీ సచివాలయానికి చెందిన చల్లా చెంచమ్మ గత 20 రోజులుగా వెన్నుపూస ఆపరేషన్ చేసుకుని తడ లోని తమ కూతురు దగ్గర  ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచానికి పరిమితమై తిరగలేని పరిస్థితి ఆమెది.  ఈ విషయం తెలుసుకున్న న్యూ కాలనీ సచివాలయానికి చెందిన వెల్ఫేర్ సెక్రటరీ కృష్ణ ఆ క్లస్టర్ కు  సంబంధించిన వాలెంటర్ ఐ. రమాదేవి ని తడకు  పంపి వైయస్సార్ పెన్షన్2500 రూపాయలను ఆమెకు అందించడం జరిగింది. తమకున్న కొంతలో మరొకరికి సాయపడాలని సహృదయులైన వాలంటీర్లకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.