నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : 18న ప్రకటించిన జెఈఈ మెయిన్లో విశ్వసాయి జూనియర్ కళాశాలకి చెందిన 117 మందికి పైగా విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎన్నికయ్యారు. వీరిలో ఎమ్.వెంకట దినేష్ (200310434131)జాతీయ స్థాయిలో 98.71 పర్సంటైల్ సాధించారు? 12 మంది విద్యార్థులు 90 కంటే ఎక్కువ పర్సంటైల్ తో 53 మంది 80 కంటే ఎక్కువ పర్సంటైల్ తో గొప్ప ప్రతిభను కనపరిచారు. విద్యార్ధుల నిరంతర కృషి, అధ్యాపకుల పర్యవేక్షణ ఈ విజయాలకు కారణమని విశ్వసాయి విద్యాసంస్థల ఛైర్మెన్ డా||యన్. సత్యనారాయణ తెలిపారు. ఈ విజయాలను సాధించిన విద్యార్ధులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మేము రూపొందించి, అవలంబిస్తున్న స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, 5 స్టెఫ్ ప్రోగ్రామ్ ద్వారా యం.పి.సి లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నామని విశ్వసాయి విద్యాసంస్థల వైస్ ఛైర్మెన్ కృష్ణమోహన్ గా తెలిపారు. ఈ ఫలితాల స్ఫూర్తితో ప్రత్యేకంగా రూపొందించిన విశ్వసాయి ఐఐటి అకాడమీకి విద్యార్ధుల నుంచి మంచి స్పందన ఉన్నదని తెలిపారు. విజయాలు సాధించిన విద్యార్ధులను పుష్పగుచ్చాలతో అభినందించారు. విశ్వసాయి విద్యాసంస్థలు బై.పి.పి లోనే కాక యం.పి.సి లో కూడా విశేష కృషి చేస్తున్నాయనటానికి ఈ ఫలితాలే నిరూపణ.జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనపరచిన విద్యార్ధులను, వారిని ప్రోత్సహించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఏప్రియల్ నెలలో జరగబోయే జె.ఈ.ఈ. మెయిన్-2 లో కూడా అసమాన్య ప్రతిభ కనబరుస్తారని, దానికి తగిన ప్రోత్సాహం అధ్యాపకులనుంచి, తల్లిదండ్రుల నుంచి ఉంటుందని తెలుపుతూ, ఈ విజయ పరంపర భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలలో కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో విశ్వసాయి జూనియర్ కాళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. క్రమశిక్షణ, సీనియర్ అధ్యాపకులచే విధ్యాబోధన పర్యవేక్షణ వల్ల తాము ఈ విజయం సాధించగలిగామని, వారందరికి తమ కృతజ్ఞతలు తెలిపారు.