ఎమ్మెల్యే మేకపాటి ని పరామర్శించిన.. గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకారెడ్డి.


ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  బెంగుళూరు లోని హాస్పిటల్ లో చికిత్స పొదుతున్నారన్న విషయం తెలిసిన వెంటనే  గోపన్నపాలెం  సర్పంచ్ గండు వెంకారెడ్డి హాస్పిటల్ కు వెళ్లి ఎమ్మెల్యే ని కలిసి అయన యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ఎమ్మెల్యే  పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని గండు వెంకారెడ్డి తెలిపారు. వ్యక్తిగత పనిపై బెంగళూరువెళ్ళిన శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బెంగుళూరులోని ఆస్టా వైద్యశాలలో చేర్పించారన్నారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మంగళవారం రాత్రి హుటాహుటిన చికిత్స అందించి స్టంట్ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన ఆరోగ్య పరిస్థితిపై  ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎవరు ఆందోళన చెందవద్దని గండు వెంకారెడ్డి తెలిపారు.