2019లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో నిర్వహించినందుకు వెంకటగిరి ఎస్సై  వెంకట్ రాజేష్ కు గురువారం నెల్లూరులో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు  చేతుల మీదగా మెమొంటో ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణాలు నిలుపుతున్న వారందరికీ ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కొనియాడారు. రక్తదానం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మెమొంటో ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహ కులు తదితరులు పాల్గొన్నారు.