నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : 29కోట్ల రూపాయలతో 14వ ఆర్థికసంఘం నిధులతో నెల్లూరు నగర అభివృద్ధికోసం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, నెల్లూరు జిల్లా కేంద్ర సహకారబ్యాంకు ఛైర్మెన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయడైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి శంకుస్థాపన చేసారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైనా పని అనుకుంటే పట్టు వదలకుండా సాధిస్తాడని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. పట్టుదలగా పని చెయ్యాలంటే జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలలో మొదటిస్థానంలో కోటంరెడ్డి
శ్రీధర్ రెడ్డి ఉంటాడని తెలిపారు. జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా తన సొంత నిధులతో సేవాకార్యక్రమాలు చేపడుతూ, అందరివాడిలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు సంపాదించారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.