స్కూల్ వ్యాన్ తగులపెట్టిన స్థానికులు
నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : నెల్లూరులోని దీన్ దయాళ్ నగర్‌లో విద్యార్ధినిపై వ్యాన్‌ డ్రైవర్ శివ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గురువారం నగరంలో జరిగిన ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు శివ‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. నెల్లూరు పట్టణంలోని ప్రైవేట్‌ స్కూల్‌లో  8వ తరగతి చదివే విద్యార్థిని ప్రతిరోజూలానే గురువారం స్కూల్‌కు వ్యాన్‌లో బయలు దేరింది. కొంతదూరం వెళ్లింది. అప్పటికి స్కూల్‌ వ్యాన్‌లో ఎవరూ లేకపోవటంతో ఆ చిన్నారిపై డ్రైవర్ శివ వాడి కన్ను పడింది. వ్యాన్‌లోనే అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ బాలిక  భయంతో పెద్దగా కేకలు వేసింది. బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని విషయం తెలుసుకుని వ్యాన్ డ్రైవర్ శివను చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటానాస్థలానికి చేరుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా..గతంలో కూడా శివపై ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయనీ..దీనిపై స్కూల్ యాజమాన్యానికి చెప్పినా శివపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ ఘాతుకపై ఆగ్రహనికి  గురైన స్థానికులు స్కూల్ వ్యాన్ ను తగలబెట్టారు.