నెల్లూరు, జనవరి 06, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. ద్వారదర్శనం నిమిత్తం భక్తుల కొరకు ప్రత్యేక, ఉచిత దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అనంతరం కనకదుర్గ భక్త మండలి ఆధ్వర్యంలో ప్రసాదవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పర్వదిన సందర్భంగా రమేష్‌ భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.