జగనన్న స్వచ్ఛ సంకల్పంతో పట్టణ, గ్రామీణాభివృద్ధి  రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి

 వెంకటచలంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమం 

గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు 

పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం' 

క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ సర్కార్ 

 కార్యక్రమంలో పాల్గున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి 

చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన నేతలు 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి  అక్టోబర్ 2గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకారం చుట్టి గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యసేవలుఅందించడమే లక్ష్యంగా రూపొందించిన 'క్లీన్‌ఆంద్రప్రదేశ్‌(క్లాప్‌)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమాన్నిప్రాంభించినట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి లు వెల్లడించారు. 

 గురువారం మండల కేంద్రమైన వెంకటచలం  ఎర్రగుంట వద్ద కమ్యూనిటీ హాల్ఆవరణలో'క్లీన్‌ఆంద్రప్రదేశ్‌(క్లాప్‌)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమాన్ని  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి,ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు ప్రారంభించారు, ముందుగా చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో పాల్గున్నారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగాప్రారంభించిన'క్లీన్‌ఆంద్రప్రదేశ్‌(క్లాప్‌)-జగనన్న స్వచ్ఛ సంకల్పం'  ద్వారా క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ సర్కార్ చేపట్టిన మహాయజ్ఞం  అన్నారు. 

 రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తిమాట్లాడుతూఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమంలో ఏపీని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజులపాటుకొనసాగనుంది.మొత్తం4,097చెతసేకరణ వాహనాలను  సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు అని తెలిపారు.  ఈ వాహనాలు రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకుచేరనున్నాయి అని వెల్లడించారు. 

 ప్రజలు ఆరోగ్యంగా , ఆహ్లాదంగా జీవించటమే క్లాప్ ప్రధాన ఉద్దేశంరాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో, ఆహ్లాదంగా జీవనం సాగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అనితెలిపారు,ఈకార్యక్రమంలోభాగంగా123కార్పొరేషన్‌లు,మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయితీలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. పదివేలమందిగ్రామపంచాయతీ కార్మికులు ఈ కార్యక్రమానికిపనిచేయనున్నారు అని తెలియజేశారు. 

 100 రోజులపాటు జగనన్న స్వచ్చ సంకల్పం: ఎంపీ గురుమూర్తి 

 సేకరించిన చెత్తను వెస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలకు తరలించి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయని, ఈ కేంద్రాల నిర్వహణకు నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు ఇచ్చి మరీ చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసేకేంద్రాలనునిర్మించనున్నారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ ద్వారా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత జగనన్న స్వచ్ఛ సంకల్పం వంద రోజుల పాటు కొనసాగనుంది అని ఆయన వెల్లడించారు. 

 ఇప్పటికే జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి,విశాఖ,విజయవాడలకు అవార్డులు వచ్చాయి. ముందు ముందు జాతీయ స్వచ్ఛ సర్వేక్షన్ లో మరింత మెరుగైన ర్యాంకు సాధించే దిశగా ఏపీ ప్రభుత్వం స్వచ్ఛతకార్యక్రమాన్నినిర్వహించనుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీఓ, వెలుగు ప్రాజెక్ట్ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.