ఉప్పల్‌: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు నవీన్‌ను అత్త అనిత కత్తితో పొడిచి చంపింది. పోలీసుల కథనం ప్రకారం... ఆరు నెలల క్రితం అనిత తన కుమార్తెకు నవీన్‌తో వివాహం జరిపించింది. పెళ్లయిన నెలకే అనిత కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నవీన్‌పై అనిత కేసు పెట్టింది. ఈ కేసు కొనసాగుతుండగానే ఇవాళ నవీన్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.