ఆత్మకూరు : మాజీ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి మృతి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుందరరామిరెడ్డి భౌతికకాయాన్ని శుక్రవారం సందర్శించి నివాళులు అర్పించి, సుందర రామిరెడ్డి కుమారులు రాఘవేంద్ర రెడ్డి, రవీంద్ర రెడ్డి లను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు సార్లు శాసన సభ్యునిగా సుందర రామిరెడ్డి చేసిన సేవల్ని జిల్లా ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. ఆత్మకూరులో బిఎస్‌ఆర్‌ ప్రజా వైద్యశాల ద్వారా పేద ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని అన్నారు.