-కమిషనర్ పివివిస్ మూర్తి


గ్రామ/వార్డు సచివాలయ సేవలపై కార్యదర్శులకు అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి పేర్కొన్నారు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో సచివాలయ విభాగం ట్రైనర్ లకు ప్రత్యేక శిక్షణా తరగతులను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని శిక్షణా విధానాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 22 మంది శిక్షకులకు ట్రైనింగ్ నిర్వహించామని, సచివాలయం లోని వివిధ విభాగాలు, డాష్ బోర్డ్, తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు జరిగే అప్ డేట్స్ లపై అవగాహన కల్పించామని తెలిపారు. శిక్షణ పొందిన వారు జిల్లాలోని అన్ని సచివాలయ కార్యదర్శులకు విభాగాల వారీగా ప్రత్యేక శిక్షణ అందిస్తారని వివరించారు. ప్రజలకు అన్ని విభాగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు రూపొందించిన సచివాలయ వ్యవస్థకు కీలకమైన కార్యదర్శులు శిక్షణ పొంది అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన పెంచుకోవాలని కమిషనర్ సూచించారు.