నెల్లూరు, జనవరి 08, (రవికిరణాలు) : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎన్‌ఏఏ, ఎన్‌ఆర్‌పి, ఎన్‌ఆర్‌సి బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిఐటియు పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి మోడీ, అమితాషా లపై ఆగ్రహం వ్యక్తం చేస్తు నేడు కార్మిక సంఘాలు ఏకమై భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు అడ్డుకున్నారు.