కర్త0 ఆత్మీయులకు వందనం నేటితో 20 వ రోజురాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులు, అండదండలతో 14వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన  కర్తo ప్రతాప్ రెడ్డి తనను ఆశీర్వదించి మంచి మెజార్టీతో తో  గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు కర్తo ఆత్మీయులకు వందనం అను కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం నేటితో 20 వ రోజుకు చేరుకొంది.   ఈ సందర్భంగా డివిజన్ లోని పద్మావతి నగర్ ప్రాంత ప్రజలను కలుసుకున్న కర్తo .సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి నెల వికాస్ ఆరోగ్య దీపిక పదకం క్రింద 50000/-  రూపాయలు ఖర్చు పెట్టి పిబ్రవరి నెలనుంచి పేదప్రజలకు మందులు పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది.కావున 14 డివిజన్ లోనీ  ప్రజలు ఈ కార్యక్రమమును సద్వినియోగం చేసుకోవాలని తెలియపరచడం జరిగినది . ఇంకా ఏ మైన సమస్య ఉన్నా తనకు తెలిపితే  రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకొనిపోయి వాటిని పరిష్కరిస్తామన్నారు. మంత్రి గారు 14వ డివిజన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారంటూ డివిజన్ ప్రజల తరపున మంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు.