నెల్లూరు, డిసెంబర్ 27:-- 

జిల్లా ప్రణాళిక అధికారిగా పనిచేస్తున్న శ్రీ సురేష్ కుమార్ అనారోగ్యంతో ఆదివారం ఆకస్మికంగా మృతి చెందడం పట్ల సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం లో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో జిల్లా అధికారులు అందరూ  సంతాపసూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.  ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు శ్రీ హరెందిర ప్రసాద్,  శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదెహ్ ఖరే,  శ్రీమతి రోస్ మాండ్, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు,  వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.