కోవూరు, జనవరి 30, (రవికిరణాలు) : జాతిపిత, మహాత్మాగాంధీ చూపించిన సత్యం,అహింసా మార్గాములో ప్రతి ఒక్కరూ నడవాలని,మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అహింసా మార్గములో పోరాటం చేసి విజయం సాధించినది ఒక్క భారతదేశ స్వతంత్ర ఉద్యమము మాత్రమే నని, దానికి కారణం మహాత్మా గాంధీ గారేనని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారని,ఆయన చూపిన బాటలోప్రభుత్వాలు గ్రామాలను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఆనాడే చెప్పారని, అంటరాని తనం నిర్ములన కొరకు ఆయన పోరాటం చేసారని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి, శివుని రమణా రెడ్డి, కావలి ఓంకార్, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, కలువాయు చిన్న కృష్ణా రెడ్డి, కె.నారాయణ రెడ్డి,మస్తాన్, పముజుల సుబ్బారావు, రవి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.