చంద్రబాబు అరెస్ట్ పై తెదేపా నాయకుల నిరసన


పలమనేరు, జనవరి09, (రవికిరణాలు) : అమరావతినే రాజదానిగా కొనసాగాలని  అమరావతి జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్ర ను అడ్డుకొని,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో సహా జె ఏ సి నాయకులను అరెస్టు చేయడము దారుణమని పలమనేరు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు నాగరాజ  అన్నారు. విజయవాడలో నాయకుల అక్రమ అరెస్టులకునిరసనగా పలమనేరు పట్టణంలోని ఏటీఎం సర్కిల్ వద్ద బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిపై  తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా  నాగరాజ
మాట్లాడుతూ...అమరావతి రాజధాని రైతులు అన్ని అనుమతులు తీసుకొని బస్సు యాత్రకు బయలుదేరే సమయములో పోలీసులు బస్సుయాత్రను అడ్డుకోవడముతో పాటు,ఆ యాత్రను ప్రారంభించడానికి వెళుతున్న నారా చంద్రబాబు నాయుడు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడము అన్యాయం అన్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని,మంత్రులు, అధికారపక్ష శాసనసభ సభ్యులు ఉద్యమకారులను,రైతులను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని,
ప్రజాస్వామ్యములో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, ఎవరైనా నిరసనలు
తెలుపుకోవచ్చన్నారు. ఇప్పటికయినా ముఖ్యమంత్రి  ప్రజలలో వస్తున్న ఉద్యమాన్ని చూసి  మూడు రాజధానులు ప్రతిపాదన విరమించుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ,మండల,గంగవరం తెదేపా అధ్యక్షులు సుధీర్ కుమార్,గొబ్బిళ్ల కోటూరు సుబ్బనాగయ్య, జగదీష్ నాయుడు,ప్రసాద్ నాయుడు,జిల్లా కార్యదర్శి వెంకటరమణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబు,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ బ్రహ్మయ్య, నాయకులు ఖాజా మధన్, మురళి, గిరిబాబు,సుబ్రమణ్యం గౌడ్, చిన్ని, గిరి, చిట్టిబాబు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.