ఆత్మకూరు, ఫిబ్రవరి 04, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఏ.ఎస్. పేట మండలం తిమ్మానాయుడు పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ భూమిని లబ్ధిదారులకు తెలియకుండానే ఇతరుల పేరిట మార్చేసిన రెవెన్యూ అధికారులు..తిమ్మా నాయుడుపల్లి గ్రామంలోని 37/1 సర్వేనెంబర్ లోని 121 ఎకరాల భూమి గ్రామంలోని 30 మంది లబ్ధిదారుల పేరిట సెటిల్మెంట్ పట్టా గా( రైతు పట్టాలు) ఉండగా ఇది తమ భూమి అంటూ  గత రెండేళ్లుగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తూ ఉంది.. వివాదంలో ఉన్న ఈ భూమిని ఏఎస్ పేట మండల తాహసిల్దార్ తోట శ్రీనివాసులు ఇటీవల బెంగళూరుకు చెందిన ముగ్గురు వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డుల లో నమోదు చేశారంటూ భూలబ్ధిదారులు వాపోయారు.. వారు చెప్పిన వివరాల ప్రకారం తమ పేరిట ఉన్న తమ గ్రామంలోని భూమిని రెవెన్యూ అధికారులు  బెంగుళూరు లో నివసిస్తున్న ముగ్గురు పేరిట 10వన్, వన్ బి, అడంగల్ లలో పేర్లను మార్చి వేశారని రెవెన్యూ తాహసిల్దార్ మార్చిన రికార్డులతో  సదరు ముగ్గురు వ్యక్తులు వారి బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని బాధితులు వాపోయారు. ఈ పొలాల వైపు సోమశిల ఉత్తర కాలువ నీరు ప్రవహిస్తూ ఉండటంతో వీటికి మంచి ధర  ఉండడంతో ఈ భూ కుంభకోణానికి మూలకారణం. తమ పేరిట రికార్డ్ లో ఉన్న పొలాలను వేరే వారి పేరిట మాకు తెలియకుండానే స్థానిక  నాయకులు అండదండలతో మార్చి వేసిన తాహసిల్దార్ పై చర్యలు తీసుకొని తమ భూమిని తిరిగి తమ పేరిట మార్పు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు...