నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం నందు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆవరణలో కీ.శే. బయ్యా వెంకటరమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ పేరుపై ఆమె కుమారులు బయ్యా వాసు, బయ్యా రవి లు ఏర్పాటు చేసిన మహాకవి తిక్కన విగ్రహాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బయ్యా ప్రసాద్, వై.ఎస్.ఆర్.సి.పి.నాయకులు శ్రీరాం సురేష్, వేలూరు మహేష్, దువ్వూరు శరత్ చంద్ర, వందవాశి రంగా, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, పప్పు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.