రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయితీలో వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి గ్రామ సచివాలయం, సీసీ రోడ్లు, డ్రైన్లుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వపాలనలో ప్రజలకు ప్రతీ పథకం అందేలా నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులకు భరోసాగా నిలుస్తూ వారి అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఈ సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్ను బాలకృష్ణారెడ్డి పాప కన్నా దయాకర్ రెడ్డి, బత్తిన 
పట్టాభిరామిరెడ్డి, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.