పంచాయతీ అభివృద్ధి పై దృష్టిసారించాలి

పంచాయతీ పరిధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎంపిడిఓ సురేంద్ర నాథ్ కోరారు .వార్డు సభ్యుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది .ఈ సందర్భంగా ఎంపీడీవో సురేంద్ర నాథ్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు . ముఖ్యంగా ఇంటి పన్ను , లేఅవుట్లు , వివిధ లైసెన్సులు జారీ , సెల్ టవర్ల ఏర్పాటు వంటి వాటిపై పంచాయతీగా ఆదాయం వస్తుంది అన్నారు . దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీ కి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు .ఇక పరోక్షంగా స్టాంప్ డ్యూటీ , వృత్తి పన్ను , వివిధ రకాల సీనరీస్ ద్వారా పంచాయతీలకు కొంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉందన్నారు . పంచాయతీకి వచ్చే ఆదాయం అనుసరించి 30 శాతం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ,15 శాతం పారిశుద్ధ్యం ,మరో 15 శాతం వీధి దీపాలకు 15 శాతం తాగునీటి వసతికి వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు .పంచాయతీ సమావేశాలను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలన్నారు . ప్రతి సమావేశంలోనూ వచ్చిన వార్డు సభ్యుల మేరకు కోరం చూసుకొని పంచాయతీ తీర్మానాలను ఆమోదించుకోవాలని ఆయన సూచించారు . వార్డు సభ్యులను తొలగించే అధికారం జిల్లా పంచాయతీ అధికారికి ఉందన్నారు .పెద్ద ఎత్తున వార్డు సభ్యుల పై ఆరోపణలు వచ్చినప్పుడు దీనిపై పంచాయతీ సెక్రెటరీ నివేదిక అనుసరించి ఎంపీడీవో ద్వారా పంచాయతీ అధికారికి నివేదిక పంపడం జరుగుతుంది అన్నారు . అంతకుమునుపు వార్డు సభ్యులకు పంచాయతీ పరిధిలో ఉన్న హక్కులు ,బాధ్యతలు తదితర అంశాలపై రిసోర్స్పర్సన్లు రమణ మూర్తి ,రామలింగం , శ్రీదేవి , శైలేంద్రకుమార్ ,ప్రకాష్ ,కరుణాకర్ బృందం వివరించారు .తదనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ నూట ముప్పై ఎనిమిది మందికి ఎంపీడీవో సురేంద్ర నాథ్ , సత్యవేడు పంచాయతీ సెక్రటరీ మునివాసులు ధ్రువీకరణ పత్రాలను అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు , పలువురు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు