- కమిషనర్ పివివిస్ మూర్తి

నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ సంక్షేమ పధకాలకు అర్హులను గుర్తించడం గ్రామ/వార్డు సభల ద్వారానే సాధ్యమవుతుందని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి పేర్కొన్నారు. స్థానిక 42, 48 డివిజన్లలో శుక్రవారం జరిగిన వార్డు సభల్లో ఆయన పాల్గొని ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వలంటీర్ల ద్వారా నవశకం సర్వేలో సేకరించిన సమాచారంలో ఆరోగ్యశ్రీ పధకం అర్హులు/అనర్హుల జాబితాలను అన్ని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల్లో మార్పులు, చేర్పులు ఉంటే వార్డు సభలో తెలిపితే
సవరిస్తామని కమిషనర్ స్పష్టం చేసారు. బహిరంగంగా ప్రజల సమాచార వివరాలు పొందుపరిచినపుడే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.