కోట, డిసెంబర్‌ 26, (రవికిరణాలు) : కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామంలో విద్యుత్ స్తంభంపై మస్తాన్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అతను కరెంట్ పని చేసే అబ్బాయి అని స్థానిక కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేసి ఎల్.సి తీసుకున్నాడని సమాచారం.ఏది ఏమైనా అధికారుల విచారణలో నిజ నిజాలు తెలియాల్సి ఉంది.