కోట మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాళెంలో నివసిస్తున్న వంకా నాగరాజు, అమ్ములు దంపతుల రెండేళ్ల కుమారుడు బాల చెన్నయ్య గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ ఇంటికి సమీపంలోని పంట కాలువలో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.