రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి పట్టణ ట్రంక్ రోడ్ లోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో బైక్ ర్యాలీగా వెళ్లి పెట్రోల్ బంకు వద్ద నిరసన ప్రదర్శన  నిర్వహించారు. 

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పెట్రోలు,  డీజిల్ ధరలు పెరిగినందున వాహనదారులు మాత్రమే కాకుండా  రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, నిత్యవసర వస్తువులు పెరిగేందుకు ఈ ధరలు  ప్రభావితం చేస్తున్నాయని,  వీటిని ప్రజలు సహించరని త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. విఫలమైన ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని నినాదాలు చేశారు.  ఈ నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన  కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు