సీమాంధ్ర బి.సి. సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులువుల్లిపాయల శంకరయ్య విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు ఇద్దరు బి.సి.లకు పదవులు ఇవ్వడం హర్షించతగ్గ విషయం ఇప్పటివరకు పార్లమెంటుకు పోని కులాలకు పదవులు ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి అభినందనీయులు. బిసిలకు ఇచ్చిన హామీలను అడగకుండానే అమలుచేస్తున్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాలలో కూడా పోటీ చేయించున్న బి.సి అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని అదేవిధంగా ఎన్నికల సమయంలో బి.సి.లు, ఎస్.టి., ఎస్.సి., బి.సి. మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.పై కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జి. చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు కె. దయాకర్, టి. శివశంయికర్, కె. జయరామరాజు తదితరులు పాల్గొన్నారు.