విజయవాడలో జరిగే" ప్రజా ఆగ్రహ" సభకు భారీగా తరలిన కావలి బీజేపీ శ్రేణులు.


భారతీయ జనతాపార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు  కుట్టు బోయిన బ్రహ్మానందం  అధ్యక్షతన 28-12-2021  విజయవాడలో జరిగే ప్రజా ఆగ్రహ సభకు కావలి పట్టణం నుండి భారీగా తరలిన బీజేపీ శ్రేణులు.

ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టు బోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిజెపి ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ప్రజా ఆగ్రహ సభకు కావలి పట్టణం నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు అని తెలిపారు. బహిరంగ సభ విజయవంతం కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు, బీజేపీ అభిమానులకు పట్టణ శాఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర  ఏళ్ళు పూర్తయిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ప్రజలను భయపెట్టి భయాందోళనకు గురి చేసి పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది తెలిపారు.