పెదకాకాని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆళ్ల బ్రదర్స్ - ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్

పెదకాకాని గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే విధంగా చూడాలని పొన్నూరు మాజీ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ మరియు తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గార్లు జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారిని  కలిసి తమ  రిప్రజెంటేషన్ అందజేశారు.

పెదకాకాని గ్రామము యంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు మరియు వారి సోదరుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గార్ల  స్వగ్రామం అయినందున  గతంలో జరిగిన ఎన్నికల్లో తమ వర్గ ఓటమిని జీర్ణించుకోలేక,  సర్పంచ్ అకాల మరణం వలన మరలా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో, ఏవిధంగా నైనా పంచాయతీని హస్తగతం  చేసుకోవాలనే దురుద్ధేశంతో యంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు మరియు వారి సోదరుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వారి అధికార బలంతో  తన నియోజకవర్గమైన  మంగళగిరి లో పనిచేసే పోలీసు అధికారులకు మరియు ఇతర శాఖ అధికారులకు ఎన్నిక నిర్వహణ  బాధ్యతలు  అప్పగించి వారిని ప్రలోభపెట్టి ఎన్నికలలో విజయం సాధించుటకు ప్రయత్నం చేస్తున్నారు అని, మరియు వారి ఆగడాలను  ప్రశ్నించే స్టానికులను బెదిరింపులకు గురిచేసే విధంగా  స్థానికేతరులు అయిన రౌడిసీటర్లను మరియు వారికి అనుకూలంగా ఉన్న చుట్టూ ప్రక్కల గ్రామాలలోని  స్థానికేతరులను గ్రామంలో దించి దొంగ ఓట్లు వెయ్యటానికి మార్గాలను సుగమనం చేస్తున్నారు అని కావున  దీనిపైన ప్రత్యక దృష్టి పెట్టి  ఎన్నికలలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా మరియు ఎన్నికల విధుల్లో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన అధికారులను నియమించవద్దు అని ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకోవలసినదిగా తమ ప్రతిపాదనలో కోరియున్నారు.