పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ఏబీవీపీ ఆందోళన

గూడూరు, జనవరి 22, (రవికిరణాలు) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక గూడూరు మండలం చెన్నూరు లోని అరుంధతి కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేక మూత పడడం జరిగింది ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని పాఠ్యాంశాలు బోధించడానికి ఉపాధ్యాయులు కూడా లేదని విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు చెప్పి బాధపడ్డారు చెన్నూరు అరుంధతీ పాలెం ఏంపిల్లోని పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక పాఠశాల నిర్వహించడం లేదు బోధన లేదు డిప్యూటేషన్ మీద వేరే పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వచ్చి అక్కడ బోధన చేసి వెళుతూ ఉంటారు విద్యార్థులు మాత్రం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు లేక బయట ఆడుకుని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని ప్రభుత్వాలు చెప్తే గానీ ఆ మాటలు వట్టి మాటలతో మిగిలిపోతున్నాయి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువులో లేక ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు నిద్ర మేల్కొని సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని వారు పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారు ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయుడు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న కిరణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు