కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

దర్శనం, ఘాట్ రోడ్లు మూసివేత

అంతేకాదు.. నేటి సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే.. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. కాగా.. రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేస్తామని ప్రకటించింది.